బాలాజీ నగర్ డివిజన్లో బిజేపి-జనసేన ప్రచారం

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం 115 బాలాజీ నగర్ డివిజన్లో బిజేపి బలపరచిన జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రచారంలో భాగంగా మంగళవారం కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ వన్ గాంధీ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.