శాంతిభద్రతల విచ్ఛిన్నమే వైసీపీ ధ్యేయం: బాడిశ మురళీకృష్ణ

జగ్గయ్యపేట, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను విచ్చిన్నం చేసి రాజకీయ లబ్ది పొందడమే వైసీపీ లక్ష్యం అని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ పత్రిక ముఖంగా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని, మొన్న కోనసీమ అల్లర్లు ఇప్పుడు విశాఖలో గొడవకు అదే కారణం అని వివాదాలు, ఘర్షణలకు సంబంధం లేని జనసేన నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని నేరమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తోనే అభివృద్ధి సాధ్యమని కొంతమంది ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల అవినీతి భగోతం ఎక్కడ బయట పడుతుందో అనే భయంతో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని, ఆ దిశగా జనసేన అడుగులు వేస్తుందని బాడిశ మురళీకృష్ణ పేర్కొన్నారు.