కుప్పం జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కుప్పం: జనసేన అధిష్టానం ఆదేశాల మేరకు.. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.హారి ప్రసాద్ మరియు కుప్పం నియోజకవర్గ ఇంచార్జి డా.వెంకటరమణ పర్యవేక్షణలో.. జిల్లా కార్యదర్శి కె.రామమూర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వేణు మునెప్ప ఆధ్వర్యంలో.. కుప్పం మండల అధ్యక్షులు సుధాకర్ అధ్యక్షతన.. కుప్పం టౌన్ సంఘంలో ఆదివారం క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు సన్మానం మరియు కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గం సమన్వయకర్త మంజునాథ్, కుప్పం నాయకులు బాలాజీ, అరవింద్, సతీశ్, వెంకట్, రాజు, మూర్తి, గణేష్, బాబు, భవాని ప్రసాద్, సతీశ్, నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు నవీన్, మరియు శాంతిపురం నాయకులు అరుణ్ హాజరయ్యారు.