రాజమండ్రి సిటీ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

రాజమండ్రి సిటీ, రాజమహేంద్రవరం స్థానిక 2 వ డివిజన్ నారాయణపురం ప్రజానీకానికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ కార్యదర్శి శ్రీ విన్నా వాసు మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ. జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయి కిట్లు పంపిణీ కార్యక్రమం స్థానిక రెండో వార్డులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన పలువురికి కిట్ల పంపిణీ చేశారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ గతంలో కంటే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా క్రియాశీలక సభ్యత్వాలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనికి నిదర్శనం జన సేన పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ అని పవన్ కళ్యాణ్ మీద అచంచలమైన నమ్మకం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు రాష్ట్రంలో ప్రజలకు జనసేన పార్టీ మెరుగైన పరిపాలన అందిస్తుందని సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా ఈ యొక్క ఐదు లక్షల ప్రమాద బీమాని జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టారని తద్వారా కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండటమే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే వైసిపి గవర్నమెంట్ కు ఎటువంటి చలనం లేకపోవడం బాధాకరమని కౌలు రైతుల మరణాలకు చలించిన పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల సహాయం జనసేన పార్టీ తరఫున అందించటం జరుగుతుంది రాబోవు 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని అనుశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, రాజమహేంద్రవరం నగర ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, నగర కార్యదర్శులు అల్లాటి రాజు, గున్నం శ్యాంసుందర్, నగర నాయకులు నర్సిపూడి రాంబాబు, స్థానిక నాయకులు మానే ఆదిబాబు, కోళ్ల భద్రరావు, భగవాన్ గొట్టపు సురేష్ చింతా మణికంఠ, రొక్కమ్ నాగు, మానే ఆనంద్, రాజా, అనిల్, బాల, మురళి, పడాల వీర్రాజు, లక్కిం శెట్టి భాస్కర్, గుడివాడ లోవరాజు, సాయి, రమణ తదితరులు పాల్గొన్నారు.