మేడారం జాతరలో సేవకు జనసైనికులు ముందుండాలి: ఆకుల సుమన్

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో జనసైనికులు సేవలు అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహా జాతరకు 50 లక్షల నుండి కోటి మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటారని కావున ప్రభుత్వం నిర్వహించిన అధికారుల సేవలతో పాటు భక్తులకు జనసైనికులు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమములు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా మూడవ దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జాతర సేవలో పాల్గొనే ప్రతి జనసైనికుడు తప్పనిసరిగా మాస్కు ధరించి శానిటైజేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు, మరియు ఈ మేడరం జాతరతో పాటు కొన్ని గ్రామాలలో జరుగుతున్న మినీ జాతరకు కూడా స్థానికంగా ఉన్న జనసైనికులు సేవలు అందించాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, ఆహార పదార్థాలు, వృద్ధులకు మరియు వికలాంగులకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచుకొని సహాయం చేయాలని ఆకుల సుమన్ తెలియజేసారు.