పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
పిఠాపురం, జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం టౌన్ 17వ వార్డు మరియు 27వ వార్డులో పర్యటనలో భాగంగా ఇద్దరు దివ్యాంగులకు బియ్యం, నూనె, ఉల్లిపాయలు మరియు కూరకాయలు జనసేన తరుపున పి.ఎస్.ఎన్ టీమ్ ఇవ్వడం జరిగింది. నిత్యం ప్రజల కోసం పనిచెయ్యడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే మేముసైతం అని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసినదిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కసిరెడ్డి నాగేశ్వరావు, కర్రి కాశీ, కోలా దుర్గాదేవి, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, పబ్బిరెడ్డి ప్రసాద్, తోట సతీష్, నామ శ్రీకాంత్, గొల్లప్రోలు వీరమహిళలు నాగమణి, కనకలక్ష్మి, రోషిణి మరియు పి.ఎస్.ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.