గురజాలలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గుంటూరు జిల్లా, గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు ఆదేశానుసారం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీసునందు మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ కిట్స్ పంపిణీ మరియు సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసాపత్రాలను అందజేసి పార్టీ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మండల అధ్యక్షులు, పట్టణ నాయకులు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, క్రియాశీలక వాలంటీర్లు, మరియు జనసైనికులు భారీగా పాల్గొన్నారు.