ఉరవకొండలో ఘనంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉరవకొండ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మరియు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ ఆదేశానుసారం ఉరవకొండ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అనంతపురం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య సమక్షంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శులు గౌతమ్ కుమార్, రాపా ధనుంజయ, విజయ్ కుమార్, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, జిల్లా నాయకులు కృష్ణ, కార్యక్రమ కమిటీ సభ్యులు అజయ్ ఉరవకొండ జనసేన పార్టీ మండల అధ్యక్షులు, చంద్రశేఖర్, కూడేరు మండల అధ్యక్షులు నగేష్ చేతులు మీదుగా ఇన్సూరెన్స్ బాండ్లను, ఐడి కార్డు మరియు ప్రత్యేకమైన ” పవన్ కళ్యాణ్ మనోగతం ” విశిష్టమైన పుస్తకాన్ని కూడా క్రియాశీలక సభ్యులకు అందజేశారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి తగిన సూచనలను సలహాలను క్రియాశీలక సభ్యులందరికీ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల కమిటీ సభ్యులు, జనసేన పార్టీ ఉరవకొండ మండల వీరమహిళలు రజిని, ప్రియాంక, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది.