శ్రీరామ నవమి సందర్బంగా జనసైనికుడు రవిరాజ్ చౌదరి ప్రసాదం వితరణ

విజయనగరం, శ్రీరామ నవమి సందర్బంగా ఆదివారం ఉదయం స్థానిక టీచర్స్ కాలనీలో ఉన్న కోదండరాముని ఆలయం మరియు కామాక్షి నగర్ లో ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, ప్రజలు యోగక్షేమాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు రెండువందల మంది భక్తులకు పానకం, ప్రసాదం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.