కార్పొరేటర్ల కన్నా రాబందులు, తోడేళ్ళు నయం.. వైసీపీ దాష్టీకాలపై విరుచుకుపడ్డ ఆళ్ళ హరి

  • వైసీపీ కార్పొరేటర్ల కన్నా రాబందులు, తోడేళ్ళు నయం
  • అధినేత అవినీతి స్పూర్తితో క్షేత్రస్థాయిలో దోపిడీకి తెరతీసిన కార్పొరేటర్లు
  • పేదలు, సామాన్యులు, రోజు వారీ కూలీలు జీవించే పరిస్థితి లేదు
  • అరకొర వచ్చే సంపాదనను కార్పొరేటర్లు దోచుకుంటే సామాన్యుడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?
  • అన్ని అనుమతులు ఉన్నా ఇల్లు కట్టుకోవాలి అంటే సీ టాక్స్ కట్టాల్సిందే
  • కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది మీకు ప్రజా సేవ చేయటానికా అంటూ ప్రజలపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు
  • స్థానిక సమస్యల్ని పరిష్కరించాల్సిన కార్పొరేటర్లే పెద్ద సమస్యగా మారితే ప్రజలు తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలి?
  • ఎలాంటి నేతల్ని ఎన్నుకుంటున్నారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి
  • గుంటూరు నగరంలో అధికార వైసీపీ కార్పొరేటర్ల దాష్టీకాలపై విరుచుకుపడ్డ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు అర్బన్ పరిధిలో కార్పొరేటర్ల దాష్టీకానికి, దోపిడీకి పేద, సామాన్యులు జీవించే పరిస్థితి లేదని, వైసీపీ కార్పొరేటర్ల కన్నా శవాల్ని పీక్కుతినే రాబందులు నయమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి విమర్శించారు. రోజురోజుకీ వికృతరూపం దాల్చుతున్న వైసీపీ కార్పొరేటర్ల దందాపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే ఆయన స్పూర్తితో కిందిస్థాయి నాయకులు పేదల్ని, మధ్యతరగతి ప్రజల్ని తోడేళ్ళులా పీక్కుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బజ్జీల బండ్లు, టిఫిన్ బండ్లు, చేపల వ్యాపారులు, తోపుడు బండ్ల వారి దగ్గర రోజు వారీ వసూళ్లు చేయటం దుర్మార్గమన్నారు. చిన్న చిన్న వ్యాపారాలతో వచ్చే అరకొర సంపాదన ఈ కార్పొరేటర్లే దోచుకుంటే సామాన్యులు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. అధికారులతో, దళారులతో బెదిరించి ప్రజల కష్టాన్ని రోజువారీగా, నెలవారీగా దోచుకోవటం అత్యంత హేయమన్నారు. ఇసుక కనిపిస్తే చాలు ఇంటిముందు వాలేంటీర్లు, సెక్రటరీలు గద్దల్లా వాలిపోతున్నారన్నారు. నిర్మాణాలకు సంభందించిన అన్ని అనుమతులు ఉన్నా కార్పొరేటర్ ( సీ ) టాక్స్ కట్టాలంటూ యజమానుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారన్నారు. రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్య0, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు కృషి చేయాల్సిన కార్పొరేటర్లు తమ గురుతర బాధ్యతను మరచి దోపిడీనే పరమావధిగా ప్రజల్ని వేధించుకుతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మా నాయకుడు ఉన్నాడు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటాడు అన్న ధైర్యాన్ని భరోసాని ఇవ్వాల్సిన నాయకులే ప్రజల్ని కాల్చుకుతింటుంటే వారు ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చరిత్ర హీనులుగా మారొద్దని కార్పొరేటర్లకు హితవు పలికారు. ఇప్పటికైనా ప్రజలపై వేధింపులు, దోపిడీలు ఆపాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన జనసేన పోరాడుతుందన్నారు. ప్రజలు కూడా ఎలాంటి నేతలకు ఓట్లేసి గెలిపిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలని ఆళ్ళహరి కోరారు.