ఫ్రేజర్‌పేటలో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు 37వ డివిజన్ ఫ్రేజర్ పేట ప్రాంతంలో గురువారం మావులూరి సురేష్ & రాగిణిల ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు సత్యన్నారాయణ, రమణ, ఓలేటి అచ్చాయమ్మలను కలిసి వారి బాగోగులని అడిగి తెలుసుకుని వారికి చిరు కానుక అందచేసి తమ మద్దతు తెలియచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకరోజు పెద్ద ఎత్తున దివ్యాంగుల దినోత్సవాన్ని జరిపించి తమ ప్రభుత్వానికి ప్రచారం చేసుకోడం తప్ప ఈ వై.సి.పి ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకంగా చేసినది ఏమీ లేదని విమర్శించారు. స్వచంద సంస్థలు అందచేస్తున్న కిట్లు, పరికరాల శాతం కన్న తక్కువ శాతం నేడు ఈ ముఖ్యమంత్రి హయాములో ఇస్తున్నారన్నారు. మన రాష్ట్రం ఎంత దుస్తితిలో ఉందంటే కనీసం బధిరులకు వినికిడి సహాయ యంత్రాన్ని సైతం అందచేయలేని అత్యంత పేద రాష్ట్ర స్థాయిలో ఉందనీ ఇందుకు ఈ వై.సి.పి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ముందు చూపులేకుండా చేసే పనులకి నేటి పరిస్థితి నిదర్శనమని దుమ్మెత్తిపోసారు. దివ్యాంగుల సంక్ష్యేమం కోసం జనసేన పార్టీ తప్పక పాటుపడతాదని వీరు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.