మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఫ్లెక్సీ లను తొలగించాలి: నంద్యాల జనసేన

నంద్యాల: పేదలకి పెత్తందారులకిమధ్య జరిగే యుద్ధం అనే పేరుతో వైసిపి నాయకులు అత్యంత ఆటవికంగా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పల్లకి మోస్తున్నట్లు ఫ్లెక్సీలో చిత్రీకరించి వైసీపీ ఎమ్మెల్యేలు మరియు నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. దీనివలన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆ ఫ్లేక్సీలను వెంటనే తీసివేయాలని లేని పక్షంలో యాంటీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని నంద్యాల జనసేన నాయకులు చందు, సుందర్ మీడియ ముఖంగా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నంద్యాల గౌరవ డిఎస్పి కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల వీరమహిళ సంగా జయంతి, గోస్పాడు జనసేన నాయకులు సాయి, బాబా ఫక్రుద్దీన్, నాగరాజు, హైమజ, రవి, ఫరూక్, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.