తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో భారీ చేరికలు

  • జనసేన పార్టీలో చేరిన వానపల్లిగూడెం యువత

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు మరియు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు నచ్చి తాడేపల్లిగూడెం పట్టణ 2, 3, 4 వార్డులలో వానపల్లిగూడెం యువత 100 మందికి పైగా జనసేన పార్టీ లో చేరగా, వారికి కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువతకు బంగారు భవిష్యత్‌ కోసం బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. ఇప్పుడున్న తాడేపల్లిగూడెం నేత ఎంత సేపూ వారి కోసం, వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు తప్ప, మీకోసం ఆలోచించడంలేదని వ్యాఖ్యానించారు. నేను మీ అందరికీ ఇష్టమైన వ్యక్తిని కావొచ్చు కానీ నేను సగటు మధ్యతరగతి మనిషిని, సామాన్యుడ్ని అని తెలిపారు. అంతే కాకుండా యువత కులాల‌కు మ‌తాల‌కు అతీతంగా అండ‌గా నిల‌బ‌డితే జనసేన అధికారంలోకి రావడం తథ్యం అని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని కులాల ఐక్య‌త సాగాల‌ని, అది జ‌న‌సేన‌తోనే సాధ్యం అని ఆయన యువతతో చెప్పారు. అంతేకాకుండా ఈరోజు భీమవరంలో జరిగిన సంఘటనలో నాయకుల మరియు జనసైనికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ.. రాజ్యాంగానికి చట్టాలకు లోబడి మేం ముందుకు సాగుతామని మా పార్టీ విధానం కూడా అదే అని, అబద్ధపు కేసులు, అక్రమ కేసులు ప్రజా పోరాటాలను ఆపలేవని ప్రజలను పాలించాలని జగన్ రెడ్డికి అధికారం ఇచ్చారు గానీ వారి పార్టీ అక్రమాలకు అడ్డు చెప్పిన వారిని అణిచివేయడానికి కాదని, భవిష్యత్తులో ఎవరిది నిజమైన పోరాటమో, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుందని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వానపల్లిగూడెం యువత ఇంటి చిన్ని, గణేషుల పవన్ కళ్యాణ్, మంగిన సాయికిరణ్, ఇంటి పండు, మునిపర్తి శీను, దెందుకూరి జగదీష్, తోటసాని హనుమంతు, గంధం బాలాజీ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.