జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం న్యాయ విభాగ అధ్యక్షులుగా ఎం. హనుమాన్

విజయవాడ వెస్ట్: న్యాయవాది మరియు జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి ములకల హనుమాన్ ను జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆంధ్రప్రదేశ్ న్యాయ విభాగ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ హనుమాన్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎం హనుమాన్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు అవ్వరు మల్లికార్జున గారికి, రాష్ట్ర అధ్యక్షులు నీలూరీ రుషింగప్ప మరియు పోతిన వెంకట మహేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కులానికి ఒక గుర్తింపు తీసుకువస్తానని చేతి వృత్తులు కులాలని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన లక్ష్యంగా ఉన్నత చదువు చదువుకొని రాజకీయాలకు వచ్చాను. చేతివృత్తుల కులాలకు ఒక గుర్తింపు లభించాలి. చేతి వృత్తుకురాలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటి కేంద్రాల ఏర్పాటు చేయాలని, 365 రోజులు పని కల్పించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి కానీ వైసిపి ప్రభుత్వం కేవలం చేతి వృత్తి కులాలని కేవలం ఓట్ బ్యాంకింగ్ గా వాడుకుంటుంది గాని వాళ్లకు సరైన గుర్తింపు ఎక్కడ లభించలేదు దీని కోసం మేము పోరాడతామని తెలియజేశారు.