వైసిపి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి: జనసేన డిమాండ్

విశాఖ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ పలు జంక్షన్ వద్ద వైసిపి నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ తూర్పు నియోజకవర్గం 15వ వార్డ్, 12వ వార్డు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులతో కలసి శ్రీమతి అరుణ ఈ అసమర్థ మరియు రౌడీ పాలనపై పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పై సి.ఐ సోమశేఖర్ వెంటనే స్పందించి జీవీఎంసీ వారితో మాట్లాడి ఫ్లెక్సీలు తొలగిస్తామని హామీ ఇచ్చారు.