దుంపగడప గ్రామ జనసేన నిరసన

ఆకివీడు మండలం దుంపగడప గ్రామపంచాయతీలో గల ఉప్పుటేరు సర్వే నంబర్ 132/2 లో 70 సెంట్లు ఆక్రమించుకోవడం జరిగింది. అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం కాపాడాల్సిందిగా కోరుచున్నాము. 70 సెంట్లు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దొంగలకు నిరసనగా ఆదివారం దుంపగడప గ్రామ జనసేన పార్టీ తరఫున నిరసన గళం విప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చినకాపవరం జనసేన పార్టీ తరుపున అడపా ఏసుబాబు(వార్డు సభ్యుడు) మరియు జనసైనికులు దుంపగడపలో నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడం జరిగింది.