జీసస్ అనాధ వృద్ధాశ్రమంలో ఘనంగా దుంపటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగ అధ్యక్షులు డేగల రామచంద్ర రావు పిలుపు మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దుంపటి శ్రీనివాస్ కి ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం నగరంలో గల జీసస్ అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. జీసస్ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకులు లక్ష్మీ మరియు ఆశ్రమ సభ్యులు దుంపటి శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, సెక్రటరీ గుంత సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండ్ల పవన్ కళ్యాణ్ ముఖ్య కార్యకర్తలు షేక్ మాలిక్, బాణాల శ్రీకాంత్, కలకొండ వంశీ, బానోత్ దేవేందర్, భూక్యా శివ తదితరులు పాల్గొన్నారు.