ECIL‌ జాబ్స్‌ నోటిఫికేషన్‌

నగరంలోని ఈసీఐఎల్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపటితో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగియనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ప్రింట్‌ తీసి గడువులోగా పోస్టు ద్వారా పంపిచాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, పర్సనల్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ లాంటి పోస్టులున్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ప్రతిభ ద్వారా ఉద్యోగార్థులను ఎంపికచేయనుంది.

మొత్తం ఖాళీలు: 15

ఇందులో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 4, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ పర్‌చేస్)- 1, సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్)- 2, సీనియర్ మేనేజర్ (లా)- 1, పర్సనల్ ఆఫీసర్- 1, అకౌంట్స్ ఆఫీసర్- 1 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో. అయితే హార్డ్‌ కాపీని ప్రింట్ తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత అడ్రస్‌ జనవరి 11లోపు పంపించాలి.

అడ్రస్: అడిషనల్‌ జరల్‌ మేనేజర్‌ అండ్‌ ఇన్‌చార్జ్‌, హెచ్‌ పర్సనల్ గ్రూప్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఈసీఐల్‌ (పోస్ట్‌), హైదరాబాద్‌- 500 062, తెలంగాణ.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 31

హార్డ్‌ కాపీలు పంపడానికి చివరితేదీ: 2021, జనవరి 11

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/ లేదా http://www.ecil.co.in/