ఏలూరు: 53వ నెంబర్ తీర్మానాన్ని రద్దు చేయాలని అఖిలపక్ష పార్టీల నిరసన

ఏలూరు నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇటీవల విడుదల చేసిన స్మశాన వాటికల్లో మృత దేహాల ఖననానికి ఫీజు వసూలు చేయాలనే కౌన్సిల్ తీర్మానం 53ను వెంటనే రద్దు చేయాలంటూ అఖిలపక్ష పార్టీలు శుక్రవారం నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రవేశపెట్టిన 53వ నెంబర్ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే ప్రజలు అధిక ధరలతో వివిధరకాల పన్నులతో సతమతమవుతుంటే కొత్తగా స్మశాన వాటికలో కాటికాపరి పేరుతో దహనసంస్కారాలకి ప్రతి బాడీ కి రూ.5000/-వేల రూపాయలను చెల్లించాలని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో తీర్మానం చేయటం సిగ్గు చేటని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. వెంటనే ఈ 53వ నెంబర్ తీర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.