పెనికేరు గ్రామం నుండి జనసేనలో చేరికలు

*అన్ని వర్గాలను ఆదరించే గొప్ప మనసున్న నాయకుడు జనసేనాని మాత్రమే, పెనికేరు గ్రామం నుంచి పలువురు బీసీ శెట్టిబలిజ యువత, కార్యకర్తలు భారీ చేరికలు: బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, ఆలమూరు మండలంలోని, పెనికేరు గ్రామం నందు రాత్రి 9 గంటలకు జనసేన ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ పెనికేరు గ్రామం వచ్చి, పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర ఉత్సవం సందర్భంగా ఆ చల్లని తల్లి దర్శించుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించిన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పెనికేరు గ్రామ జనసేన నాయకులు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన, వనచర్ల ధనరాజ్, పెనికేరు గ్రామం జనసైనికులు నాయకత్వంలో, కార్యకర్తలతో కలిసి, పెనికేరు గ్రామంలోని శెట్టిబలిజ యువతను, కార్యకర్తలను, నాయకులను జనసేన పార్టీ ఇన్చార్జి, జనసేన పార్టీలోకి ఎంతో ఆత్మీయతతో సాదరంగా ఆహ్వానించి, జనసేన పార్టీ జెండాను వారి భుజస్కందాలపై ఉంచి అభినందించారు. జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేనానికి అధికారం లేకపోయినా, జనసేనాని ఆశయాలు ఉన్నత భావాలు ప్రజల్లోకి బలంగా వెళుతూ ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిగా అన్ని వర్గాలు ఆదరించే, మంచి మనసున్న కాబోయే ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను చూస్తామని, కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లోనూ, జనసేన పార్టీ అంచెలంచెలుగా అన్ని వర్గాలను, అందరి ప్రేమను పొందుతుందని, రాబోయే రోజుల్లో బీసీలు, శెట్టిబలిజ సోదరులకు, దళిత, మైనారిటీ సోదరులకు ఖచ్చితంగా, అన్ని వర్గాల తో సమానంగా పెద్దపీట వేస్తామని, అదేవిధంగా అన్ని వర్గాలను, బీసీలను, దళితులను మైనారిటీలను ఆదరించి అక్కున చేర్చుకుని, సమన్యాయం చేస్తామని, జనసేనాని పిలుపే! మా లక్ష్యంగా అన్ని వర్గాలను, అందరినీ ఆదరిస్తూ కలుపుకుని, జనసేనాని అందరివాడిగా నిలబెడతామని, ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి శెట్టిబలిజ సోదరులు బీసీ సోదరులు రావడం, ఈ భారీ చేరికలతో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడం, ఎంతో సంతోషం ఆనందం బండారు శ్రీనివాస్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన ప్రముఖ నాయకులు వనచర్ల ధనరాజు తో పాటు, నరాల శ్రీనివాస్, గుత్తుల సూరిబాబు, వల్లి వీరన్న, గెద్దాడ సోమాలు, గెద్దాడ నగేష్, గెద్దాడ నాగరాజు, జుత్తుగ చందర్రావు, గెద్దాడ శ్రీను, గుత్తుల బాబి, పిల్లి సతీష్, చొల్లంగి శివ, గుత్తుల శ్రీకృష్ణ తదితర నాయకులతో పాటు కార్యకర్తలు సుమారు 100 మంది వరకు శెట్టి లిజ యువత, బండారు శ్రీనివాస్ నాయకత్వానికి జై కొట్టి జనసేన పార్టీలోకి చేరారు.