దాడులకు పాల్పడితే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి

అనంతపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరి భద్రత కల్పించాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ కేంద్రాన్ని కోరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర, జనసేన పార్టీ అఫీస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు గత రెండు రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న సంథర్భంగా, అథినేత వ్యక్తిగత సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయటం జరిగింది. దీని పైన పూర్తి వివరాలు ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. అంథ్రప్రదేశ్ రెడ్డి వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ వాహనంగా ఒకటి గుర్తించినట్లు, మరోక వాహనం గుజరాత్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా దీని పైన తెలంగాణా పోలీసులు పూర్తిస్థాయిలో నిష్పక్షపాతమైన విచారణ జరిపి, వాస్తవాలను బహిరంగపరచాలని జనసైనికుల తరపున బలంగా డిమాండ్ చేస్తూన్నాము. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే, భౌతిక దాడులకు పాల్పడితే మాత్రం, రాష్ట్రంలో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాజకీయాలలో వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు మంచి పద్ధతి కాదు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరీ భద్రత యొక్క అవశ్యకతపై దృష్టి పెట్టాలని వైజాగ్ సంఘటన జరిగిన తరువాత భద్రత ఎంతైనా అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కి రోజు రోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ శత్రువులు ఎక్కువగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉంటుందని భావించాలి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి మనకు అంటే జనసేన పార్టీకి పొత్తులో ఉన్న బిజేపి అధినాయకత్వంపై వత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరీ భద్రత కోసం జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అందుబాటులో ఉన్న ట్విట్టర్ ద్వారా గాని మెయిల్స్ ద్వారా గాని, ఉత్తర రూపంలో గాని ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంకి తెలియజేయండి. గత మూడు రోజులుగా జరుగుతున్న పవన్ కళ్యాణ్ నివాసం వద్ద రాజకీయ నాయకుల శత్రువుల కదలికలు మనకందరికీ ఆందోళనకరం ఉన్నాయి కాబట్టి ఎంత త్వరగా పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.