ఉత్సాహంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గాజువాక, జనసైనికులకు అండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం జీవీఎంసీ 85వ వార్డులో చేరిన కొండయ్య వలస మినీ జగదాంబ సెంటర్లో గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85 వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర రావు ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగింది. క్కువమంది కొత్తవారు జనసేన పార్టీ కోసం పనిచేయాలని ఉత్సాహంతో క్రియాశీలక సభ్యులుగా చేరుటకు ఆసక్తి కనపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి వసంత్ కుమార్, మోటూరు గంగరాజు, బుద్దిరెడ్డి అప్పారావు, కళ్ళుబంటి సుధాకర్, లక్కరాజు సన్యాసిరావు, సీరంశెట్టి వెంకట్రావు, మోటూరు అప్పారావు, విందుల పాపారావు, విందుల నర్సింగరావు, కోట శ్రీధర్, దానబాల శ్రీనివాసరావు, జాజుల శ్రీనివాసరావు, లక్కరాజు అప్పలరాజు, నారాయణరావు, పిల్ల శివకుమార్, జాజుల కృష్ణ, లక్కరాజు నూకరాజు, విందుల జానీ అలియాస్ అప్పలరాజు, ఇతర జనసైనికులు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.