బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎర్రవరం జనసేన

ప్రత్తిపాడు, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సవ్యసాచి, అరుదైన నేత, సామాజిక విప్లవ యోధుడు, మాజీ ఉపప్రధాని బాబూజగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ప్రత్తిపాడు నియోజకవర్గం ఎర్రవరం గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఘననివాళులర్పించడం జరిగింది.