నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు

పలాస, పవన్ కళ్యాణ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నాగరాజ్ ద్వారా, పలాస మునిసిపాలిటీలో తిలక్ నగర్లో నివసిస్తున్న ఒక వ్యక్తికి, రోజు వారి కూలి పనులు చేస్తూ తిరిగి సైకిల్ మీద వస్తుండగా దారిలో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో నరాలు దెబ్బతిన్నాయి, మంచాన పడ్డ పెద్దదిక్కు.. నాలుగు ఇళ్ళల్లో పనిచేసుకొనే మహిళకు కష్టాలు, తండ్రి పరిస్థితి చూసి ఫీజ్ కట్టలేక పరీక్షలు రాయలేని కుర్రోడు. ఈ కుటుంబానికి ఆర్ధిక సహాయం చాలా అవసరం అని తెలుసుకుని జనసేన పార్టీ అధక్షులు పవన్ కళ్యాణ్ తరుపున ఆదివారం నిత్యావసర సరుకులు సహాయంగా ఆ కుంటుంబానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోన కృష్ణ రావు, ఉదయ్ మరియు గిరీష్ పాల్గొన్నారు.