జనసేనతోనే సురాజ్య స్థాపన.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో నేరేళ్ళ సురేష్

ప్రజల పట్ల జవాబుదారీతనంతో భవిష్యత్ తరాల పట్ల బాధ్యతతో, పేదల కన్నీరు తుడుస్తూ.. జనరంజక పాలన అందించే సురాజ్య పాలన ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో జరిగిన 75 వ స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నేరేళ్ళ సురేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ లక్షలాదిమంది నిశబ్ద వీరుల ప్రాణత్యాగ ఫలమే నేటి స్వాతంత్ర్య భారతదేశమన్నారు. ఎలాంటి భారతదేశం కోసమైతే కలలు కని కారాగారంలో తమ జీవితాల్ని అర్పించారో, ఉరికోయల్ని ముద్దాడారో అలాంటి భారతదేశం కోసం ప్రతీఒక్కరూ కృషిచేయాలని కోరారు. అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యాధిపత్యాన్ని అస్తమింపచేసి, భారతీయులను దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసి దేశప్రజలు స్వేచ్ఛా వాయువులు అందించే క్రమంలో దేశంకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ప్రతీఒక్కరికీ యావత్ భరతజాతి రుణపడి ఉంటుందన్నారు. వారి త్యాగాలు వృధా కాకుండా ప్రతీ పౌరుడు బాధ్యతగా మెలగాలని ఆళ్ళ హరి కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో అమరులైన స్వాతంత్ర్య వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం పెద్దలకు స్వీట్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యర్ర శ్రీను, షర్ఫుద్దీన్, కోనేటి ప్రసాద్, బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, రాము, శేషు, కోటి, అంజి, పోతురాజు, యూసుఫ్, రాజశేఖర్, సుబ్బారావు, రాధాకృష్ణ, తిరుపతిరావు, జక్క రమేష్, రమణ, ఒంగోలు శ్రీను, కొరివి రాజు, తోట సాంబశివరావు, కామేష్, కాసులు, కొండూరు కిషోర్, ఉపేంద్ర, పులిగడ్డ గోపి, సలాం, సాయి, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *