“ప్రతి వ్యక్తి ఇసుక, పంచదార మిశ్రమం లాగే ఉంటాడు”

అసంతృప్తిని మనం మొదట్లోనే తుంచేయాలంటే ఎదుటి వ్యక్తిలో ఒక లోపం కనిపిస్తే ఒక్కలోపంతోనే దాన్ని సరిపెట్టుకోవాలి. దానికి ఇంకొన్ని జోడించి పెంచొద్దు, అలా జోడించుకుంటూ వెళితే కొన్నాళ్ళకు అవతలి వారు నెత్తురు తాగే కసాయివాడిలా కనిపిస్తాడు. మనం ఏ ప్రదేశానికి వెళ్లినా, ఎవరింటికి వెళ్లినా, ఏ సంస్థలో పనిచేస్తున్న, ఏ వ్యక్తితో కాపురం చేస్తున్నా అనేక విషయాల్లో అలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఆ ఓక్క లోపమే కదా, సరిచేసుకుంటాడులే ! మిగతా విషయాల్లో రత్నం అని అనుకుంటే చాలు భార్య-భర్త, ఉద్యోగి-యజమాని ఇలా దోషాన్వేషణ మానేసి, ఇన్ని సుగుణాలు ఉన్నప్పుడు ఆ ఒక్క దోషాన్ని తట్టుకోలేమా! అని సర్దుకుపోవాలి

కిరణాలతో వెన్నెల కురిపించే చంద్రుని అనేకానేక సుగుణాల ముందు అతనికున్న చిన్న మచ్చ లెక్కలోకి రాదు..అలాగే ఎంతో విలువైన హిమవంతుడి గొప్పతనానికి, అతనిపై ఉన్న మంచు అడ్డుకాదు

సంపూర్ణాంగా దుర్మార్గుడు అనే మనిషిని మనం చూడలేం..అలాగే సంపూర్ణంగా గుణవంతుడైన వ్యక్తిని చూడలేం! ఎంతటి మహా పురుషుడినైనా చూడండి! ఎంతటి అవతార పురుషుడి పేరైనా చెప్పండి! వారికి వ్యతిరేకంగా గ్రంధాలు రాసిన వారు కూడా ఉన్నారు. శ్రీరామచంద్రుడ్ని అంగీకరించలేకపోయిన వారు ఉన్నారు. గాంధీ సిద్ధాంతాలను ఒప్పుకోలేక పోయిన వారు ఉన్నారు. ఎందుకంటే సృష్టి రహస్యమే అది

భర్తలో ఒక లోపం కనిపించింది… ఎన్నో మంచి సుగుణాలున్నాయి… కోపమొక్కటే ఆయనలో ఉన్న లోపం..ఏం సర్దుకోలేవా? సృష్టిలో లోపం లేనిది లేదు..వ్యక్తుల మధ్య ఉండే అసంతృప్తులు, ఉద్యోగాల్లో ఉండే అసంతృప్తి, సంసారం లో ఉండే అసంతృప్తి పోవాలంటే ఈ విషయం అవగాహన చేసుకోవాలి..

ఉదాహరణ :
ఇసుక పంచదార కలిసి ఉంటాయి. చీమ పంచదారను తీసుకుంటుంది, ఇసుకను వదిలేస్తుంది. మనం చీమ నైపుణ్యాన్ని అలవాటు చేసుకుంటే..ఇసుకను దొర్లిద్దామని ప్రయత్నం చేయకూడదు. ప్రతి వ్యక్తి ఇసుక, పంచదార మిశ్రమం లాగే ఉంటాడు..మనకు కావలసిన పంచదారను మనం తీసుకోవాలి ..మనం భవనమే కట్టలనుకుంటే ఇసుకె తీసుకోవాలి..పంచదార వదిలేయాలి ..కాఫీ త్రాగాలంటే పంచదారే తీసుకోవాలి..ఇసుకతో త్రాగలేం.

అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన ఎవరికైతే బాధ్యతలు స్వయంగా ఇచ్చారో వారిలో కూడా శక్తి సామర్ధ్యాలు ఉండబట్టే ఇచ్చారు..వీరిని కూడా అలాగే చూడండి, తప్పలనేని కనబడవు.

➡️ గోపాలకృష్ణ,
రాజేంద్రనగర్ నియోజకవర్గం.