ఓ యువతా ఇకనైనా మేలుకో… ఎర కి బలికాకూడదు నీ భవిత…!

జనసైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక నమస్కారములు…

ప్రపంచంలోనే అత్యంత యువత ప్రాబల్యం కలిగి ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క జనసేన పార్టీ మాత్రమే,
కావున యువత రాజకీయాల్లోకి రావాలని సేనాని పిలుపునిచ్చారు. దానికి కారణం ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించి పోయారు, ఇంకా ఎన్నాళ్ళు ఈ మూస ధోరణి నాయకుల పాలనలో ఎన్నాళ్ళు ఇంకా ఈ దేశ భవిష్యత్ నలిగిపోవాలి అని కొన్ని సంవత్సరాలుగా తన మదిలో వచ్చిన ఆలోచనలతో తానే కంటికి కనపడని శత్రువుతో అంతర్ యుద్దం చేస్తున్న సమయంలో పుట్టినదే జనసేన. యువ శక్తి నిర్వీర్యం కాకూడదు అనే తపనతో ప్రతి క్షణం పరితపించే గొప్ప వ్యక్తి జనసేన అద్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి వారి ఆలోచన శక్తితో దేశంలో మొట్టమొదటి సారిగా నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు సేనాని, అదే జీరో బడ్జెట్ రాజకీయాలు, తొలి ప్రయత్నంలోనే సుమారు ఇరవైఅయిదు లక్షల మందిని మార్చగలిగారు, అదే స్పూర్తితో నైతిక విలువలను గౌరవిస్తూ సహనంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ, కుటిల రాజకీయ నాయకుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ నిరంతరం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న శ్రామికుడు, తనకు అన్నం పెట్టీ ఆదరించిన కళామ్మ తల్లి ఒడిలో జీవన పోరాటం చేస్తున్న ఎందరో కళాకారులకు అండగా నిలబడి అవసరం అయితే తాను సమిధగ మారతాను అని బహిరంగంగా ప్రకటించిన సినీ కార్మిక శక్తి సేనాని, పట్టెడు అన్నం పెట్టే రైతన్న తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఉబిలో కూరుకుపోయి బ్రతుకు బారమని ఈ లోకం విడిచిపోతుంటే పాలకులు చోద్యం చూస్తూ బ్రతలేక చేస్తున్నారు అని అవహేళన చేస్తూ రైతు కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తూ వారిని కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్న సమయంలో, కౌలు రైతుల కోసం బరోసా యాత్ర కార్యక్రమం ద్వారా ఒక్కో రైతు కుటంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడంలో సాహోసోపేతమైన నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు పెద్దన్న అయ్యారు. అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షం రెండు కూడా ప్రజల సమ్యలను, ఇక్కట్లను గాలికి వదిలేసి సొంత వ్యాపారం మరియు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుంటే సేనాని మాత్రం ప్రజా సమస్యలపై గళమెత్తారు, అదే సేనాని జనవాణి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సువర్ణ అక్షరాలతో రాయడానికి ఎన్నో ఇంకెన్నో కార్యక్రమాలకు, సేనాని అధ్యక్షతన జనసేన పార్టీ పోరాటాలకు కంకణం కట్టుకుంది.

మీ…✍️
సూర్యా నంద్యాల
జనసేన పార్టీ,
రాజోలు నియోజకవర్గం.