జనసేన జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

* ఉమ్మడి విజయనగరం జిల్లా సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు
జెండా మోసి పార్టీ బలోపేతం కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మంగళవారం ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. విజయనగరం జిల్లాను తమ ఆధిపత్య రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న వైసీపీ నాయకులకు విశ్రాంతినిచ్చి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు బాధ్యతగా గెలుపు కోసం పని చెయ్యాలని సూచించారు. ఆధిపత్యం, అజమాయిషీ కోసం కాకుండా బాధ్యతగా వ్యవహరించిన వారికే అవకాశాలు ఉంటాయని, అలాంటి వారికే జనసేనలో నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదని వైసీపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకొని ప్రజలను వెనక్కు నెట్టేస్తున్నారు అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్మును అందినంత వరకు దోచుకుంటూ, ప్రజలను బానిసలుగా తయారు చేసి మేము ఇంతకన్నా ఎదగలేము అనే భావన ప్రజల్లో తీసుకు వచ్చారని, ఇంకా ఎంత గొప్పగా ఎదగవచ్చనేది జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం చేసి చూపిస్తుందని అన్నారు. అన్ని మండలాల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యకర్తలంతా పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో, నియోజకవర్గం బాధ్యులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు.
* ఆరు కోట్ల మంది ఆంధ్రుల బాధ్యత తీసుకున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
ఒక గ్రామం, ఒక మండలం, ఒక ప్రాంతం కోసం నిలబడి పని చేయడమే కష్టం అనుకుంటున్న తరుణంలో ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత తీసుకున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని నాగబాబు గారు స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు సుభాష్ చంద్రబోస్, భగత సింగ్ లాంటి మహానుభావుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్నారు అన్నారు. మరో 20 ఏళ్ల రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఊహకు కూడా అందరని అన్నారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ సుందరపు వెంకట సతీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *