అగ్ర రాజ్యంలో క్రికెట్ లో సత్తా చాటిన ప్రవాసాంధ్రులు-విజయం సాధించిన జనసేన టీమ్

అమెరికా, వర్జీనియాలో జూలై నుండి నవంబర్ వరకు జరిగిన ఫాల్ సీజన్ క్రికెట్ మ్యాచ్ లు ముగిశాయి. మొత్తం 40 టీమ్ లు పాల్గొనగా కింగ్స్ మెన్, జనసేన టీమ్ లు ఫైనల్ లో తలపడ్డాయి. వర్జీనియా లోని ఫెయిర్ ఫాక్స్ అండ్ లోడౌన్ కౌంటీ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కింగ్స్ మెన్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో. బ్యాటింగ్ చేపట్టిన జనసేన టీమ్ 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేశారు. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ మెన్ టీమ్ ఆల్ ఔట్ అయ్యి 125 పరుగులకు పరిమితం అయింది. 3 వికెట్లు 19 పరుగుల వ్యత్యాసంతో జనసేన టీమ్ ఫాల్ సీజన్ విన్నర్ గా నిలిచింది. మ్యాచ్ లకు ఆరోగియా, బి.ఎన్ అసోసియేట్స్ స్పాన్సర్స్ గా విజయ్ గుడిసేవ, సత్య బల్లా వ్యవహరించారు. ఫాల్ సీజన్ కెప్టెన్ గా శరత్ వ్యవరించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు గా శివ వినీల్ నిలిచారు. నాలుగు వికెట్లు తీసి నరేంద్ర చెన్నుపాటి తన బౌలింగ్ సత్తాను చాటారు. అత్యధిక పరుగులు చేసి రఘు వంశీ విజయానికి మార్గం చూపారు. విజయ్ తటవర్తి ఎక్కువ వికెట్లు తీసి టీమ్ కు బలంగా నిలిచారు. క్వాలిఫైడ్ మ్యాచ్ లో సుమంత్, వినీల్, శివ, సాయి ముత్యాల లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు సొంతం చేసుకున్నారు. కోర్ టీమ్ సభ్యులుగా శ్రీధర్, శరత్, మునీర్ లు వ్యవహరించారు. ఊహించని విధంగా అమెరికాలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో 40 టీమ్ లతో తలపడి ఫైనల్ గా ప్రవాసాంధ్రుల జనసేన సీజన్ గెలవడం పట్ల ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి.