ఈ-క్రాఫ్ట్ లో నమోదు కోసం తిరిగి తిరిగి విసిగి వేసారి పోతున్న రైతులు

మదనపల్లె, ఆరుగాలం కష్టపడి చీడపీడలు ప్రకృతి వైపరీత్యాలు నుండి పంటను పొత్తిళ్లలో బిడ్డ లా కాపాడుకుంటున్న రైతు తీరా ఆ పంట చేతికొచ్చాక దాన్ని అమ్మకుండా ఉంటే సవాలక్ష నిబంధనలు. పండించిన ధాన్యం అమ్ముకోవాలి అంటే వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాఫ్ట్ లో నమోదై ఉండాలి. ఆ వివరాలన్నీ పౌరసరఫరాలు, మార్కటింగ్ శాఖలు అనుసంధానంగా కావాలి. ఇవన్నీ ఉన్నాకే వై పి తప్పనిసరి. అప్పుడే మద్దతు ధరపై ధాన్యం ఇతర ఉత్పత్తులు అమ్ముకుని అవకాశం లభిస్తుంది. లేదంటే కష్టమే. మరోవైపు ఏ పని చేయని వారు స్థానికంగా నివసించని వారిలో కొందరి పేర్లు ఆధార్ నెంబర్ తో సహా ఈ క్రాఫ్ట్ పౌరసరఫరాల శాఖ పోర్టర్లలో కనిపిస్తున్నాయని వారి పేర్లతో వేలాది బస్తాల ధాన్యం అమ్మకాలు కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై తమకు కావాల్సిన ఆధార్ నెంబర్ లు మాత్రమే నమోదు చేయించి వారి పేర్లతో విక్రయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాగు విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవ ఈ క్రాఫ్ట్ నమోదు తక్కువగా ఉంటుంది. కొంతమంది రైతులు రైతు భరోసా కేంద్రానికి వచ్చి నమోదు చేయించుకోవడం లేదు. ధాన్యం సేకరణ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొందరు సిబ్బంది వ్యాపారులు అవకాశంగా దీని అవకాశంగా తీసుకుంటున్నారు. ఈ క్రాఫ్ట్ కానీ సర్వే నెంబర్లలో తమకు కావాల్సిన వారు పేర్లు ఆధార్ నెంబరు నమోదు చేస్తున్నారు ఆ సమయంలో ఆ పేరుతోనే వారి పేరుతోనే అమ్మకాలు జరిపినట్లు చూపిస్తున్నారు. ఎందుకు వేరు వేరు స్థాయిలో పెద్ద మొత్తం చేతులు మారుతోంది తూర్పుగోదావరి జిల్లాలోని పదిహేడు వేల మంది రైతులు చిరునామాలు దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ పరిధిలో ఉండే ఈ క్రాఫ్ట్ గ్రామంలో మొత్తం భూమి సాగు విస్తీర్ణం చేసిన నమోదయిన మొత్తం ఎంతనో వివరాలు బయటకు తెలియకుండా అంతా రహస్యం అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.