Kakinada: పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు మునిగిపోయి ఉండడం తోపెనుగుదురు, గొర్రిపూడి, పెద్దాపురప్పాడు, విజయరాయుడు పాలెం, గొడ్డెటిపాలెం గ్రామాల్లో జనసేన నాయకులతో కలిసి పర్యటించి, పంటపొలాలు పరిశీలించి, రైతులతో, మరియు కౌలు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పంతం నానాజీ పంట నష్టపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలనీ, వ్యవసాయ శాఖ మంత్రి అధికారులను తక్షణమే పంపించి పంట నష్టపోయిన వివరాలు సేకరించి ఆదుకుకోవాలని, కౌలు రైతులు ఎక్కువగా నష్టపోయారని, ఈ విషయాన్నీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకువెళ్తామని మీకు తగిన న్యాయం జరిగే వరకు పోరాడతమని రైతులకి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగిరెడ్డి కొండబాబు, బండారు మురళి, గంగాధర్, రమేష్, సత్యనారాయణ, హరనాథ్, మల్లిబాబు, నానీబాబు, సత్తిబాబు, శర్మ, గణేష్ నాయుడు, శాఖ శ్రీనివాస్, ఎస్స త్తిబాబు, రాంబాబు, అన్నవరం, యారీష్, ప్రసన్న, స్వామి, బాబు, ప్రసాద్, మాణికుమార్, వీరబద్రరావు, మల్లేష్, చంద్రశేఖర్, అంజి, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.