ముక్కొల్లు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను జగనన్న కాలనీగా చిత్రీకరణ

  • గూడూరు మండలం ముక్కోలు గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీనే పేరు మార్చి జగనన్న కాలనీగా చూపించారు
  • జగనన్న కాలనీగా పేరు మార్చబడినా రహదారి సౌకర్యం లేదు. ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు
  • అన్ని కాలనీల మాదిరే కేవలం మూడు ఇల్లు మాత్రమే పునాదుల వరకు నిర్మించారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పదివేల కోట్ల నుండి 15 వేల కోట్ల వరకు అవకతవకలు జరిగాయి
  • స్థానిక ఎమ్మెల్యే, స్థానిక నాయకులు కలిసి భూమి కొనుగోళ్లలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. తక్కువ దొరికే భూమి కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు కొన్నట్లు చూపించి ఒక్కొక్క ఎకరానికి లక్షల రూపాయలను కొల్లగొట్టారు

పెడన నియొజకవర్గం: జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలను అవినీతిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు పేరుతో సోషల్ ఆడిట్ జనసేన పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెడన జనసేన పార్టీ నాయకులు సోమవారం ముక్కొల్లు గ్రామంలోని గతంలో ఇందిరమ్మ కాలనీ, ఇప్పటి జగనన్న కాలనీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బత్తిని హరిరామ్, పండమనేని శ్రీనివాసరావు, కనపర్తి వెంకన్న, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, సమ్మెట చంద్రశేఖర్, కోలపల్లి చంద్రశేఖర్, సమ్మెట బిక్షం, కొండిశెట్టి అయ్యప్ప, ఆత్మూరి అయ్యప్ప, సమ్మెట మణికంఠ, సమ్మెట అరవింద్, కోలపల్లి నాగరాజు, సమ్మెట రాజా, బత్తు భాను, సమ్మెట శివ, నాగరాజు, బడే శివ, శీరం సంతోష్, ముద్దినేటి రామకృష్ణ, దాసరి రవీంద్ర, భీమవరపు పరమేశ్వరరావు, దాసరి నాని, పినిశెట్టి రాజు, మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.