పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన తుది విడత పోలింగ్

ఎనిమిది విడతల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో నేడు తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 35 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాగా 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 84.77 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 11,860 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 753 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్రాల వద్ద బారులు తీరారు.