కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయండి: దినకర్ బాబు

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగవ విడత కౌలు రైతుల భరోసా యాత్రను కడప జిల్లాలోని సిద్ధవటం గ్రామంలో ఏర్పాటు చేయనున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది… ఈ సమావేశంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు మాట్లాడుతూ ఈరోజు ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు ముఖ్య ఉద్దేశం, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఈనెల 20వ తారీకున కడప జిల్లా సిద్ధవటం గ్రామం లో జరగనున్నది అన్నారు.. ఎన్నో సందర్భాలలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు రైతు పడే కష్టాలను ఎలా ఉంటాయో, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఎన్నోసార్లు చెప్పారు .. రైతు లేనిదే రాష్ట్ర భవిష్యత్తు ఉండదు.

చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.. ఇప్పటివరకు, ఉభయగోదావరి జిల్లాలలో మరియు ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం నాలుగో విడతగా రాయలసీమలోని సీఎం గారి సొంత జిల్లాలో కడపలో దాదాపు 137 మంది కౌలు రైతులకు ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయబోతున్నామన్నారు.. వైసీపీ ప్రభుత్వము చేతకానితనం వల్లనే ఈ కౌలు రైతు భరోసా యాత్రను జనసేన పార్టీ అధ్యక్షులు స్వయంగా చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది అన్నారు.. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి మనకు అనగా ఆంధ్ర ప్రజలకు అవసరమా అని ప్రజలు గమనించాలి అన్నారు. రాయలసీమలో మేము చేపట్టబోయే కౌలు రైతుల భరోసా యాత్రను జయప్రదం చేయాలని కోరుతున్నాము…. రైల్వే కోడూరు లో పవన్ కళ్యాణ్ గారి అధికారిక కార్యక్రమాలు లేవు.. దీనిపైన జనసేన పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదన్నారు. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం వైసిపి పార్టీ పాలన విధానం ఎలా ఉంది అంటే మొదటి సంవత్సరం కూల్చడం, రెండవ సంవత్సరం కూడబెట్టడం, మూడవ సంవత్సరం పై రెండు చేస్తూ కులచిచ్చును రగిలించడం.. కాబట్టి ప్రజల ఆలోచన విధానం మారితే… రాష్ట్రంలో రాజకీయ మార్పు వస్తుంది.. రాష్ట్రం దారిలోకి వచ్చి అభివృద్ధి జరుగుతుందని తెలియజేసారు.

రైల్వే కోడూరు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ శ్రేయోభిలాషులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర విజయవంతం చేయాల్సిందిగా రైల్వే కోడూరు పార్టీ ఆఫీస్ నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరికుటి నాగరాజు, చవాకుల రెడ్డి మణి, నల్లంశెట్టి కిషోర్, కంబాలగుంట హరీష్ కుమార్, కోలా హరీష్, మాదం సుబ్రహ్మణ్యం, ఆలం నాగభూషణం, నూక బ్రహ్మయ్య, రాగిపాటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *