మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఫ్లెక్సీ లను తొలగించాలి

గజపతి నగరం నియోజకవర్గం, దత్తి రాజేరు మండలంలో వైసీపీ వారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా మానాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలి, అలా లేని పక్షంలో వాటిని మేమే తొలగిస్తాం అని మానాపురం పోలీస్ స్టేషన్ ఎస్సైకి జనసేన పార్టీ తరుపున రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చప్పా అప్పారావు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్, మార్పిన అప్పలనాయుడు, సూర్య బొబ్బాది, బొత్స గణేష్, సింహాద్రి ప్రవీణ్, సాలాపు రాము మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.