బాబు పాలూరు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

  • నాయకుడే సేవకుడై

బొబ్బిలి నియోజకవర్గం: లచ్చయ్యపేట దగ్గరలో ఉన్న “ఎయిమ్ ఫర్ సేవ” ఆశ్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా 4వ రోజు ఆశ్రమంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో జరిగింది. గత సంవత్సరం ఆశ్రమంలో వాటర్ సమస్య ఉందని పిల్లల కోరిక మేరకు వారి కోసం హాట్ అండ్ కూల్ వాటర్ ప్యూరీఫైర్ మిషన్ అందించిన బాబు పాలూరు పై పిల్లలు మర్చిపోలేని అభిమానం చూపించారు. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, పి ఎస్ రావు, శంకర్ రావు, శ్యామ్, మహేష్ సతీష్, హేమంత్, వీరమహిళలు దివ్య, అలివేలు, సత్య, శ్రీదేవి పాల్గొన్నారు.