మాజీ శాసనసభ్యులు మంగెన వర్ధంతి

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకుడు మహా మనిషి గొప్ప మానవతావాది రాజోలు మాజీ శాసనసభ్యులు మంగెన గంగయ్య వర్ధంతిని మలికిపురం సెంటర్లో ఘనంగా నిర్వహించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన శాసన సభ్యునిగా అందించిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరావు, గుండుబొగుల పెద్దకాపు, మేడిచర్ల సత్యవాణిరాము, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, విపర్తి సాయిబాబు, మేకల ఏసుబాబు, సుందర బుల్లబ్బులు, మంగెన హైమావతి, మంద సత్యనారాయణ, యెరుబండి చిన్ని, తోట త్రిమూర్తులు, ముస్కుడి నరసింహస్వామి గెడ్డం సూర్యారావు, అడబాల లోకేష్ మరియు జనసైనికులు అభిమానులు పాల్గొన్నారు.