మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులపై మండిపడ్డ గౌతమ్ కుమార్

  • పేదల సొంతింటి కలలు చిదిమెస్తున్న ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా జనసేన పార్టీ
  • వైసీపీ నాయకులకు ఓపెన్ ఛాలెంజ్ నిన్నటి రోజున విసిరిన చర్చకు జనసేన సిద్దం

ఉరవకొండ: జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ నివాసాలకు ఏ మాత్రం యోగ్యం కానీ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీలు అంటూ ప్రజలని మభ్య పెట్టే నిరుపేదలకు ఆశచూపి మేమే ఇల్లు కట్టి ఇచ్చి తాళం ఇస్తాము అని గొప్ప ప్రలోబాలు పలికి ఈరోజు నిరుపేదలను మరింత నిరుపేదలు చేసేవిధంగా మీ ప్రభుత్వం చేస్తుంది. క్షేత్రస్థాయిలో గత మూడు రోజులుగా జనసేన పార్టీ అద్యర్యంలో చేస్తున్న జగనన్న ఇల్లు-పేదలకి కన్నీళ్లు కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు గత మూడు రోజులు పర్యటించి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ విశ్వేశ్వరరెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ముందు మీరు నియోజకవర్గం లో ఎటువంటి అభివృద్ధి చేశారో మీరు తెలియ చేశాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి. పేదల సొంతిల్లు కలను సాకారం అంటున్నారు కనీసం మౌలిక సదుపాయాలు ఇసుక, సిమెంటు, మరి ముఖ్యంగా నీళ్ళు సదుపాయాలు లేక విద్యుత్ లేక ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటూన్నరో తెలుసా మీకు? ప్రభుత్వము 1,80,000 తో పేదల ఇల్లు కల ఎలా నెరవేరిందని అనుకుంటున్నారు?. అప్పులు చేసి మరీ ఇల్లులు కట్టుకుంటున్నారు ఇచ్చిన స్థలం లాక్కుంటంఅని స్థలం పోతుందనే భయంతో అప్పులు చేసి మరీ మీరు చెప్పే సొంత ఇంటి కలలు ఇబ్బందులు పడుతూ కట్టుకుంటున్నారని మండిపడ్డారు.

ఉరవకొండ మండల అధ్యక్షలు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నవరత్నాల ఇళ్లు పూర్తిస్థాయిలో అయిపోయాయని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వము కనీసం పునాదులు కూడా జరగలేదని ఉన్న వాస్తవాలు ప్రజలకి ఉరవకొండ జనసెన పార్టీ తెలియచేస్తున్నందున ఓర్వలేక నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే విశ్వేశవరరెడ్డి గారు, వైసిపి నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై, జనసేన నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది.

విడపనకల్ మండల అధ్యక్షులు తలారి గోపాల్, వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ అచనాల, బెలుగుప్ప మండల అధ్యక్షలు సుధీర్ మాట్లాడుతూ.. జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుకు సచివాలయ సిబ్బంది – హౌసింగ్ అధికారులు “చూపే లెక్కలకు ఏమాత్రం పొంతన లేదు అని తెలియచేశారు.

జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులకు జనసేన నాయకులపై మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని టీడీపీ డైరెక్షన్ లో ప్రెస్ మీట్, టీడీపీ డైరెక్షన్ లో పార్టీ కార్యక్రమలు చేస్తున్నారని చెప్పే వైసీపీ నాయకులు ఒళ్ళు దగరలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే మేము ఎటువంటి కార్యక్రమం అయినా చేయడానికి ప్రబుత్వ వైపాల్యాలు, ప్రజల సమస్యల కోసమే జనసేన పోరాడుతుందని తెలియ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, విడపనకల్ మండల అధ్యక్షులు తలారి గోపాల్, కేశవా, సుధీర్ వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ అచనాల, నాయకులు దేవేంద్ర, రాజేష్, అబ్దుల్, రాంబాబు, రాజు, రమేష్, మనికుమర్, ప్రియతమ, రమేష్, సురేష్, జగదీష్, జగదీష్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు..