కూల్చివేతతో మొదలు పెట్టిన వైసీపీ కూలిపోవడం తథ్యం: రెడ్డి అప్పల నాయుడు

  • ఫ్లాష్ సంస్థ ద్వారా నిర్మితమైన షెడ్డుని మున్సిపల్ అధికారులు అక్రమంగా తొలగించే ప్రక్రియకు అడ్డుపడిన ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు అక్రమ అరెష్ట్

ఏలూరు నియోజకవర్గం, అశోక్ నగర్ లోని స్మాశాన వాటికలో గత 10 సంవత్సరాలుగా ఫ్లాష్ అనే స్వచ్ఛంద సంస్థ వారు చనిపోయిన మృతదేహాలను తరలించడానికి ఫ్రీజర్ బాక్సులు, శాంతి రథాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేదవారికి ఉచితంగా చేరవేసి షెడ్డును ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ్లాష్ సంస్థ ద్వారా నిర్మితమైన ఈ షెడ్డుని మున్సిపల్ అధికారులు అక్రమంగా తొలగిస్తున్నారు.. దీనికి అడ్డుపడిన ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ లను అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కీ తరలించారు.. ఇది తెలుసుకున్న జనసైనికులు భారీ ఎత్తున పోలీసు స్టేషన్ కీ వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అనంతరం 41 నోటీసు ఇచ్చి సంతకం పెట్టించుకొని రెడ్డి అప్పల నాయుడు ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా బయటికి వచ్చిన రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరులో దుర్మార్గమైన చర్య నడుస్తుందని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. గత ఆరు సంవత్సరాలుగా, ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ పేరు మీద అంతిమయాత్రకి, శాంతియాత్రకి వాహనాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ షెడ్డుని తొలగిస్తున్నారని తెలిసి నేను వెళ్లి అడ్డుపడగా నన్ను అరెస్టు చేశారు.. చనిపోయిన డెడ్ బాడీని బంధువులు కూడా తీసుకెళ్లని పరిస్థితుల్లో ఫ్లాష్ సంస్థ ద్వారా వారు దగ్గరుండి తీసుకెళ్లి ఎవరైనా అనాధలు ఉంటే వారికి ఉచితంగా దహన సంస్కారాలు చేయటం జరుగుతుందని, అటువంటి వాటిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని గాని, మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గాని, ఇక్కడ షెడ్డు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రతి వారికి ఉచితంగా సర్వీస్ అందిస్తున్న ఈ షెడ్డును కూల్చడం ఏంటని ప్రశ్నించారు.. సోమవారం కమిషనర్ వచ్చి ఈ షెడ్యూల్ ఖాళీ చేయాలని ఎల ఆదేశాలు జారీచేస్తారు? గత ఆరు సంవత్సరాలుగా మేము ఈ సేవలు చూస్తున్నామని మీరు కూలుస్తుంటే దాన్ని అడ్డుకోవాలని వస్తే అధికారులు పోలీసులు వారు ప్రొక్లెయిన్ తీసుకొచ్చి ఈషెడ్డు ను తొలగించడం ఏమిటి అని ప్రశ్నించారు.. మీరే ఈ షెడ్డును హ్యాండొవరు చేసుకోండి ? ఆ వాహనాన్ని మీరే తీసుకోండి? ఫ్రీగా మీ సిబ్బందిని పెట్టి సప్లై చేయండి అని అంతేగాని దాన్ని నాశనం చేయకండి అని పోలీసు వారిని కోరగా మాపై దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ కి అక్రమంగా తరలించి తీసుకువచ్చారు.. పోలీస్ స్టేషన్లో 41నోటీస్ ఇచ్చి వదిలారు.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు..ఈ స్వచ్ఛంద సంస్థ వారు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు..ఇప్పటికైనా ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళనాని గారు మేలుకోండి..?, మీరు ఊర్లో ఉండి కూడా లేరనిపించుకోవడం ఎందుకు?, మీకు తెలియనట్టుగా నటించడం ఎందుకు? ఇది సరైన విధానం కాదు అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. పుట్టినవారు మరణించక తప్పదు.. చనిపోయిన తరువాత ఎవరైనా స్మశానానికి వెళ్లాల్సిందే అని ఈ స్మశానాన్ని మీరు నాశనం చేయడానికి పూనుకున్నారు.. కూల్చివేతతో మొదలు పెట్టిన మీ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం అని జోస్యం చెప్పారు.. నాకు మద్దతుగా వచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, జనసేన పార్టీ జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.