తుని జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం

తుని, మేము జనసైనికులం మా అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు ఈ సమాజానికి మా వంతు సేవా భాధ్యత అంటూ వాడపల్లి రాము మరియు కంకిపాటి లోవరాజు వారి ఆధ్వర్యంలో తుని నియోజకవర్గం అమ్మోజీ పేట ప్రాంతంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వారికి నా హృదయపూర్వక అభనందనలు తెలియజేస్తున్నానని మరియు దీనికి సహకరించిన పాయకరావుపేట హైమ నేత్రాలయ వైద్య సిబ్బందికి మరియు జనసైనికులకు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి అన్నారు.