పాల్-మేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

నెల్లూరు: పాల్-మేరీ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతురాజు టోనీ బాబు ఆధ్వర్యంలో మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ సంక్షేమ బాలికల వసతి గృహంలో బుదవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కిరణ్మయి, లత, తన్వీర్ బాలికలకు సాధారణ, దంత పరీక్షలు చేశారు. డాక్టర్ రాజశేఖర్ నేత్ర వైద్యశాల వైద్యులు లలితశివజ్యోతి, ఆప్త మాలజీ అసిస్టెంట్ శాంతి, సాయికృష్ణ, సోమ్య, సంధ్య నేత్ర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ పాల్ – మేరీ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా. అమూల్య స్వాచంద సేవ సంస్థ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం అని అన్నారు. ఆయన గత 15 ఏళ్లుగా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు అని అన్నారు. వైద్యశిబిరం నిర్వహణకు సహకరించిన పాల్-మేరీ ఫౌండేషన్ అధ్యక్షుడు శామ్యూలజాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యసాయి, శీను, జిల్లు, హరి, శఫీహరన్, లక్ష్మి, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.