వేలాది చేపలు మృతి చెందడంతో మంచినీరు చెరువు కలుషితం

  • అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం: మాకీనీడి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం పట్టణ ప్రజలకు మంచి నీరు అందించే చిత్రాడ పరిధిలోగల చెరువులో వేలాది చేపలు చనిపోవడంతో మంచి నీరుకాస్తా కలుషితమయిందని, ఇది అధికారుల నిర్లక్ష్యం వలనే జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకీనీడి శేషుకుమారి స్థానిక జనసేన పార్టీ ఆపీసులో మీడియాలో ఆరోపించారు. చేపలు చనిపోయి ఐదురోజులు గడచిన తరువాత ఎవరికి తెయకుండా సీక్రెట్ గా కుళ్ళిన చేపలను ట్రాక్టర్లతో బయట పారవేయడం జరిగిందని, ఐదురోజు కుళ్ళిన చేపలవలన మంచినీరు ఎంత కలుషితం అయి ఉంటుందో పట్టింపులేకుండా శుద్ధి చేయకుండా అదే నీటిని ప్రజలకు అందించడం దారుణమని అసలే వర్షాకాలం సీజనల్ వ్యాదు టైమ్ లో ఇలాంటివి జరగకుండా చూడవలసిన అధికారులకు నిర్లక్ష్యం తగదని క్లోరిన్ లాంటివి వాడకుండా ఆసోమ్మును దుర్వినియోగం చేస్తున్నారని 33 కోట్ల నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగాలే దని పుష్కలమైన గోదావరి నీరు బదులు బోరు నీరు అందిస్తున్నారని, రరా వాటర్ పైపులైను కూడా పూర్తి చేయకుండా కప్పివేయడంవలన గోదావరి నీరు అందించడంలేదని ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని శేషుకుమారి అన్నారు.