ద్వారకానగర్ లో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం మంగళవారం తుమ్మలపల్లి సీతారాం ఆధ్వర్యంలో 44 డివిజన్ డెక్కన్ స్కూల్ వీధి ద్వారకానగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ సమాజంలో ఏరంగం ప్రాముఖ్యత ఆరంగానిదే అనీ సమతుల్యం చెదిరితే దాని ప్రభావం రకరకాలగా వివిధ అంశాలపై పడుతుందనీ, నేడు సరిగ్గా అదే విధంగా ఇసుక ప్యాకేజీలో ఈ వై.సి.పి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వలన భవని నిర్మాణ రంగం సంక్షోభంలో చిక్కుకుని దానిమీద ఆధారపడి బతుకుతున్న లక్షలాది కార్మికులు వారి కుటుంబాలు వీధినపడి బిచ్చమెత్తుకునే పరిస్థితికి రోడ్డు మీదకొచ్చారని విమర్శించారు. తన లాభాపేక్ష కోసం ప్రకృతి ప్రసాదించిన ఇసుక మీద సైతం ఈ వై.సి.పి ప్రభుత్వం వ్యాపారం చెయాలనుకోవడం, గంపగుత్తగా తనకు సంబంధించిన గుత్తేదారునికి అప్పచెప్పి అడ్డగోలుగా ధరలని నిర్ణయించి లెక్కచూపకుండా అమ్మకాలు సాగిస్తూ అక్రమం సంపాదన చేసుకొవడం అవినీతికి పరాకాష్ట అని అన్నారు. రాబోయే జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఇసుక విధానాన్ని సమీక్షించి మెరుగైన పాలసీని ప్రజలు హర్షించేలా ప్రకటిస్తుందని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుండీ కలిదిండి సురేష్ కుమార్, జనసేన పార్టీ నుండీ ముమ్ముడి రాంబాబు, రావిపాటి వెంకటేశ్వర రావు, తాతపూడి చిన్మయశర్మ, శెట్టి జోగిరాజు, తోరం చిరంజీవి, బోండా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.