దండమూడి గ్రామ దేవతల సప్తమ వార్షికోత్సవంలో గాదె

పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు మండలం దండమూడి గ్రామంలో శ్రీ గంగానమ్మ, పోతురాజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (బొడ్డురాయి), గ్రామ దేవతల సప్తమ వార్షికోత్సవ సందర్భముగా దండమూడి గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విచ్చేసి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాదె మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన సంస్కృతులను, సాంప్రదాయాలను కాపాడటం.. అలాగే ఈ ఊరి ప్రజలు అందరు కలిసి మెలసి ఈ ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మీ ఊరి ప్రజలు భవిష్యత్తులో కూడా కలిసిమెలిసి చక్కగా ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను.. మా పార్టీ తరుపు మీ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.