గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 14వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 14వ రోజు కార్యక్రమంలో భాగంగా పెద్దూరు గిరిజన గ్రామంలో వీరఘట్టం మండల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు పర్యటించడం జరిగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకునే విధానం, సమస్యల పట్ల స్పందిస్తున్న పద్ధతి ఆంధ్రరాష్ట్ర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది ప్రజలకు జనసేన భరోసాగా నిలుస్తోందని మత్స పుండరీకం అన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గెలిచే వరకు ముద్దులు పెట్టి గెలిచిన తర్వాత పన్నులతో గుద్దేసి బస్సు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి మూడేళ్ల పాలనలో మాలాంటి వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని గిరిజన ప్రజలు అంటు, తమ ప్రధాన సమస్యలు వివరించారు. అనంతరం జనసేన జాని మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్, అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేద్దామని అన్నారు. మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న మూడు వేలమంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పున ముప్పై కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని పంచుతున్నారు ఈరోజు కోట్లాదిమంది అతనికి అండగా నిలబడతున్నారని అన్నారు. దత్తి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉచిత గ్యాస్, మహిళకు 33% రిజర్వేషన్, ఎల్.కే.జీ నుండి పీజీ ఉచిత విద్య అందించనున్నారు. రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడం ఖాయం, జనసేన విజయకేతనం తథ్యం అని కర్ణేన సాయి పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమం ద్వారా విశేష స్పందన ప్రజల నుండి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యులు బి.పి.నాయుడు, వావిలపల్లి నాగభూషన్, కంటు మురళి, గుమ్మడి సుధాకర్, దూసి ప్రణీత్, సొండి సుమన్ తదితరులు పాల్గొన్నారు.