గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 4వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, ఇల్లుసుపురం గిరిజన గ్రామంలో నాల్గవ రోజు పర్యటించిన వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన నాల్గవవ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మత్స పుండరీకం మాట్లాడుతూ… ఉన్నతమైన వ్యక్తులతోనే వ్యవస్థలో ఉన్నతమైన, ఉత్తమమైన మార్పులు వస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏర్పాటు చేసేది జనసన పార్టీ అని ఉద్భోదించారు. మన జనసేన కుటుంబం ఎంత పెద్దదైతే అంత గొప్ప విజయాలు జనసేన పార్టీ సొంతం అవుతాయని తెలియజేసారు. జనసేన జానీ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఓట్లు, నోట్లు, అధికార వ్యామోహంతో రాజకీయాల్లోకి రాలేదు, యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడానికి వచ్చారని తెలియజేసారు. సమాజంలో మార్పు రావాలంటే తుపాకులు, కత్తులు పట్టుకొని యుద్ధం చేయటం కాదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడి అభిప్రాయం చెప్పాలని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలంటే బలమైన సంకల్ప బలం ఉండాలని, ఆ సంకల్పంతో పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ అని తెలిపారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు కార్యకర్తలకు ఓపిక సహనం చాలా అవసరమని, అవమానాలకు ఎదురొడ్డి నిలబడాలని తెలిపారు. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడ్డారు తప్ప. కులాలు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలంటే బూతు స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఇల్లుసుపురం గిరిజన యువత మేము జనసేన పార్టీకి అండగా ఉంటుందని చెప్పారు. జరాజపు రాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలోని గిరిజన ప్రజల ఓట్లు జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తుకి వేసేవిధంగా మార్పు తీసుకురావాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు వావిలపల్లి నాగభూషన్, కోడి వెంకటరావు నాయుడు, దండేల సతీష్, ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.