గుడ్ మార్నింగ్ సిఎం సార్… ఈ దారిని చూడండి

ద‌ర్శి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ షేక్ రియాజ్ మ‌రియు ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ బొటుకు ర‌మేష్‌బాబు సూచ‌న‌ల మేర‌కు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోతుల‌మ‌య‌మైన‌ ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం కురిచేడు మండ‌లంలోని ప‌డ‌మ‌ర గంగ‌వ‌రం నుంచి తుమ్మెద‌ల‌పాడు, గంగ దొన‌కొండ వెళ్లే ర‌హ‌దారికి మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ… గోతులు, పాడైపోయిన ర‌హ‌దారిని సీఎం చూడాలంటూ #GoodMorningCMSir ప్లకార్డుల‌తో జనసైనికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప‌డ‌మ‌ర గంగ‌వ‌రం వార్డు మెంబ‌ర్ మ‌రియు జ‌న‌సేన పార్టీ ప్ర‌కాశం జిల్లా ప్రోగ్రామ్ క‌మిటీ మెంబ‌ర్‌ పసుపులేటి చిరంజీవి, వ‌రికూటి నాగరాజు, వరికూటి రవి, గుమిత చిన్న సుబ్బారావు, దాసరి నారాయణ, పసుమర్తి గురుబాబు, వ‌రికూటి లక్ష్మీనారాయణ, పి.కోటేశ్వర‌రావు, పసుపులేటి నాగేశ్వ‌ర‌రావు, పసుపులేటి సూర్యనారాయణ, పరిమిశెట్టి గోపి, పసుపులేటి గోపి పాల్గొన్నారు.