జనగామకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రకటించాలి: జనసేన పార్టీ డిమాండ్

జనగామ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రకటించాలని జనగామ జేఏసీ చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, విద్యార్థీ విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆదేశాలతో మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు గాదె పృథ్వి, ఆంజినేయులు గౌడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ నేత్రత్వంలో పార్టీ విద్యార్థి విభాగంతో కలిసి నేడు జేఏసీ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి చౌరస్తాలో బైటాయించారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. వారి వెంట జిల్లా నాయకులు వేదాంతం ఉదయ్, శేషాద్రి సందీప్, పెశెట్టి అజయ్ మహమ్మద్ రజాక్, రాజు, నామాల సిద్దులు, మెడిద ప్రశాంత్, రాజబోయిన రాజు, బషీర్, రాకేష్ లు ఉన్నారు.