Rayavaram: రైతుని ఆదుకోవాలి

ఆశలు అడియాశలు…
కాయకష్టం నీటిపాలు…
తడిసిన ధాన్యం…
రైతు పరిస్థితి దైన్యం…
జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు…

రాయవరం, వైసీపీ ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం అని చెప్పుకుంటే సరిపోదు రైతుని ఆదుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలే ధాన్యానికి గిట్టుబాటు ఉండటం లేదు. ప్రతి ఏడాది సాగు ఖర్చు పెరుగుతుంది. తగ్గ ఆదాయం రైతులకు అందడం లేదు. మునిగే నక్కాపై తాడి పడ్డట్టు అకాల వర్షాలు, తుపాను గండలు. రైతు కంటికి కునుకు లేకుండా చేసాయి. ఈసారి పంట చేతికి వస్తుందని అనుకున్న వేళా ఆశలు అరిపోయాయి.నిరాశ నింగికి ఎగిసింది. గత మూడు రోజులు వర్షాలు రైతులకు కన్నీళ్ళు మిగిల్చింది. దీనితో చేలో నీరు లాగక కళ్ళ ముందు పంట మునిగిపోతుంటే అన్నదాత గుండె ఆగిపోతుంది. కొందరు కళ్ళ ముందు కదాలడుతున్న అప్పులు తలచుకొని ఉసురు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు కోరుతున్నారు. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా చేపట్టిన నేపద్యంలో తిరిగి వర్షాలు కురుస్తూ మరింత నష్టం పెరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు. మరికొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తిందని తెలిపారు.