టమోటా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం: రామదాస్ చౌదరి

  • టమోటా మార్కెట్ యార్డులో జాతీయ రైతు దినోత్సవం

మదనపల్లె: టమోటా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె టమోటా మార్కెట్ యార్డ్ నందు జనసేన పార్టీ ఆద్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి హజరైనారు. ఈ సందర్భంగా రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంచిపెట్టారు. టమోటా రైతులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టమోటాకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.‌ ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే తప్ప టమోటా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపలేకపోయిందని జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పలువురు రైతులు, యువకులు జనసేన పార్టీలో చేరారు. అనంతరం గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ రైతు ప్రస్తుతం కిష్ట పరిస్థితుల్లో ఉన్నాడని తన శ్వేదం చిందించి ఇతరులకు ఆహారాన్ని అందిస్తున్నాడని, అతని కష్టం వెలకట్టలేనిదని భవిష్యత్తులో వ్యవసాయం సంక్షోభంలో పడకూడదంటే రైతాంగానికి అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటా రైతులను ఆదుకోవడానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ టమోటా రైతాంగానికి ధరలు లేని సమయంలో కిలో టమోటా 15 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటానే టమోటాకు నిలకడగా ధరలు ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వాలు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాయని టమోటా రైతుల కోసం లక్ష కోట్లు అప్పులు చేయలేవా అని ప్రశ్నించారు. టమోటా రైతాంగానికి న్యాయం చేయడానికి ప్రభుత్వ చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఆరోపించారు. ‌ఈ కార్యక్రమంలో ‌జనసేన పార్టీ నాయకులు అడపా సురేంద్ర, జగదీష్, రెడ్డెమ్మ, కుమార్, చంద్రశేఖర్, అర్జున్, ప్రభాకర్, రెడ్డి శేఖర్ రెడ్డి, ఎం. శంకర్, నాగరాజు, సంజీవ్, దేవేంద్ర పాల్గొన్నారు.